Andhra Pradesh: ‘ఐటీ గ్రిడ్స్’ డేటా చోరీ కేసు.. నేడు బాధ్యతలు స్వీకరించనున్న ఏపీ సిట్ చీఫ్ బాలసుబ్రహ్మణ్యం!

  • 9 మంది అధికారులతో సిట్ ఏర్పాటు
  • మరో రెండ్రోజుల్లో హైదరాబాద్ కు వెళ్లనున్న సిట్
  • ఐటీ నిపుణులతో సంప్రదింపులు జరుపుతున్న అధికారులు

‘ఐటీ గ్రిడ్స్’ కంపెనీలో డేటా చోరీ వ్యవహారంలో ఏపీ ప్రభుత్వం జోరు పెంచింది. ఈ కేసు విచారణకు ఏపీ సర్కారు సీనియర్ ఐపీఎస్ అధికారి బాలసుబ్రహ్మణ్యం నేతృత్వంలో 9 మంది అధికారులతో సిట్ ఏర్పాటు చేసింది. తాజాగా ఈరోజు బాలసుబ్రహ్మణ్యం ఏపీ సిట్ చీఫ్ గా బాధ్యతలను స్వీకరించనున్నారు.

టీడీపీ నేతలు డేటా చోరీపై ఇప్పటికే తుళ్లూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో మరో రెండు రోజుల్లో ఏపీ సిట్ విచారణ కోసం హైదరాబాద్ కు వచ్చే అవకాశముందని భావిస్తున్నారు. మరోవైపు ఈ కేసులో వాస్తవాలను తెలుసుకునేందుకు సిట్ పోలీసులు ఐటీ నిపుణులతో సైతం సంప్రదింపులు జరుపుతున్నారు.

  • Loading...

More Telugu News