Reliance: కూతురు, అల్లుడుతో కలసి అంబానీ పెళ్లివేడుకలో రజనీకాంత్ సందడి
- ఆకాశ్ అంబానీ పెళ్లికి విచ్చేసిన తలైవా
- తోడుగా వచ్చిన సౌందర్య, విషాగన్
- ముంబయిలో తారాతోరణం
రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ తనయుడు ఆకాశ్ అంబానీ, శ్లోకా మెహతాల వివాహానికి దక్షిణాది సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా విచ్చేశారు. శనివారం సాయంత్రం ఆయన తన కుమార్తె సౌందర్య, అల్లుడు విషాగన్ వనంగముడిలతో కలిసి ఈ పెళ్లికి వచ్చారు. ముంబయిలో జరిగిన ఈ సెలబ్రిటీ మ్యారేజ్ కి పూర్తిగా సంప్రదాయబద్ధమైన దుస్తుల్లో వచ్చిన తలైవా ఎంతో ఓపిగ్గా ఫొటోలకు పోజులిచ్చారు. తనను మధ్యలో నిలబడమని అల్లుడు విషాగన్ సూచించినా, అల్లుడు, కూతురు పక్కపక్కనే ఉండాలని ఆయన చూపించిన తపన ఈ సందర్భంగా కొట్టొచ్చినట్టు కనిపించింది. సౌందర్య, విషాగన్ లకు ఇటీవలే పెళ్లయిన సంగతి తెలిసిందే. ఇద్దరూ కొన్నిరోజుల క్రితమే హనీమూన్ పూర్తిచేసుకుని వచ్చారు.