india: సరిహద్దులు దాటిన వ్యక్తిని పాకిస్థాన్ కు అప్పగించిన భారత జవాన్లు
- పొరపాటున సరిహద్దును దాటిన 60 ఏళ్ల వ్యక్తి
- అదుపులోకి తీసుకుని విచారించిన బీఎస్ఎఫ్
- అనంతరం పాక్ సైనికులకు అప్పగింత
భారత జవాన్లు మరోసారి మానవత్వాన్ని చాటుకున్నారు. పాక్ భూభాగం నుంచి పొరపాటున సరిహద్దులు దాటి భారత్ లో ప్రవేశించిన ఓ వ్యక్తిని... సురక్షితంగా పాక్ సైనికులకు బీఎస్ఎఫ్ జవాన్లు అప్పగించారు. అంతర్జాతీయ సరిహద్దుల వద్ద శాంతి, సుస్థిరతను కొనసాగించడానికి ఇది ఉపయోగపడుతుందని ఈ సందర్భంగా జవాన్లు తెలిపారు.
పాక్ కు చెందిన ఓ 60 ఏళ్ల వ్యక్తి శుక్రవారం జమ్ముకశ్మీర్ లోని సాంబా జిల్లాలో సరిహద్దులు దాటాడు. అతన్ని గుర్తించిన భద్రతాబలగాలు, వెంటనే అదుపులోకి తీసుకున్నాయి. అనంతరం అతన్ని విచారించగా, పొరపాటున సరిహద్దు దాటానని చెప్పాడు. దీంతో, నిన్న పాకిస్థాన్ సైనికులకు అతన్ని బీఎస్ఎఫ్ అప్పగించింది.