Narendra Modi: పుల్వామా ఘటనతో మోదీ రేటింగ్ ఎలా పెరిగిపోయిందో చూడండి!
- నేషనల్ సర్వేలో ఆసక్తికర అంశాలు వెల్లడి
- 52 శాతం మంది మోదీ పక్షం
- రాహుల్ కు 27 శాతం మద్దతు
పుల్వామా ఉగ్రదాడి ఘటన, తదనంతర పరిణామాల నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై ప్రజల్లో విశ్వసనీయత మరింత పెరిగిందని ఓ సర్వేలో వెల్లడైంది. ప్రజల్లో మోదీ, రాహుల్ గాంధీలపై ఎలాంటి అభిప్రాయాలు ఉన్నాయో తెలుసుకునేందుకు టైమ్స్ నౌ, వీఎంఆర్ సంయుక్తంగా సర్వే చేపట్టాయి. ఈ సర్వేలో 52 శాతం మంది మోదీ పక్షానే నిలిచారు. ప్రధానిగా మోదీ అయితేనే దేశాన్ని సవ్యంగా పరిపాలించగలరని అత్యధికులు అభిప్రాయపడ్డారు. అదే సమయంలో రాహుల్ గాంధీకి 27 శాతం మందే మద్దతుగా నిలిచారు. ఫిబ్రవరి 5 నుంచి 21వ తేదీ వరకు ఈ సర్వే నిర్వహించారు.
అయితే, జనవరిలో ఇలాంటి సర్వే నిర్వహించినప్పుడు మోదీ వైపు 44.4 శాతం ప్రజలు మొగ్గుచూపారు. అంటే, ఒక్క నెలరోజుల వ్యవధిలోనే మోదీ ప్రజాకర్షణ 7 శాతం పెరిగినట్టు తాజా సర్వే ఫలితాల ద్వారా అర్థమవుతోంది. ప్రస్తుత సర్వేలో 7.3 శాతం మంది ప్రజలు స్థానిక నేతలకు మద్దతు పలికారు. మొత్తమ్మీద సగానికి సగం మంది నరేంద్ర మోదీ నాయకత్వాన్నే కోరుకుంటున్నారని ఈ సర్వే ఫలితాలు చెబుతున్నాయి.