Sabitha Indra Reddy: తనయులతో కలిసి కేసీఆర్‌తో భేటీ అయిన సబితా ఇంద్రారెడ్డి
- కుమారుడికి లోక్‌సభ స్థానాన్ని కోరనున్న సబిత
- ఇప్పటికే పార్టీలో చేరికపై కేటీఆర్‌తో మంతనాలు
- సబిత చేరికలో కీలక పాత్ర పోషించిన అసదుద్దీన్
మాజీ మంత్రి, కాంగ్రెస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి నేడు టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్‌తో భేటీ అయ్యారు. కాంగ్రెస్ నేతలు ఆమెను తమ పార్టీలోనే ఉంచేందుకు చేసిన యత్నాలు ఫలించలేదు. నేడు సబిత తన ముగ్గురు కుమారులతో కలిసి వెళ్లి కేసీఆర్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆమె తన కుమారుడు కార్తీక్ రెడ్డికి చేవెళ్ల లోక్‌సభ స్థానం కేటాయించాలని కేసీఆర్‌ను కోరనున్నట్టు తెలుస్తోంది.
సబిత టీఆర్ఎస్లో చేరేందుకు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీతో పాటు ఓ పారిశ్రామికవేత్త కీలక పాత్ర పోషించినట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఆమె తన కుమారుడు కార్తీక్ రెడ్డితో కలిసి అసదుద్దీన్ నివాసంలో టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌తో పార్టీలో చేరికపై మాట్లాడారు. అలాగే నిజామాబాద్ ఎంపీ కవితతో కూడా సబిత చర్చించినట్టు తెలుస్తోంది. మొత్తం మీద టీఆర్ఎస్లో ఆమె చేరిక మాత్రం ఖాయమైపోయినట్టేనని తెలుస్తోంది.