Tirumala: తిరుమల ఆలయం సమీపంలోని అడవుల్లో కార్చిచ్చు!

  • ఆలయానికి ఉత్తరం వైపు రింగ్ రోడ్ నిర్మాణం
  • ఆ పక్కనే అడవిలో వ్యాపించిన మంటలు
  • అదుపులోకి తెచ్చిన అగ్నిమాపక సిబ్బంది

తిరుమల శ్రీవారి ఆలయానికి సమీపంలోని అడవిలో నిప్పంటుకోవడంతో భక్తులు తీవ్ర ఆందోళన చెందారు. ఆలయానికి ఉత్తరం వైపు నిర్మిస్తున్న రింగ్ రోడ్ కు ఆనుకుని ఉన్న అడవిలో మంటలు వ్యాపించాయి. ఈ మంటలు అంతకంతకూ పెరగడంతో దాదాపు ఎకరా అటవీ ప్రాంతం బూడిదగా మారింది. మంటలను గమనించిన కాకులకొండ, ఫ్యాన్ల గుట్ట వాచ్ టవర్ల సిబ్బంది అటవీ శాఖ అధికారులకు సమాచారాన్ని అందించారు. దీంతో హుటాహుటిన ఆ ప్రాంతానికి చేరుకున్న అగ్నిమాపకదళం, అటవీ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు.

  • Loading...

More Telugu News