Vijayasaireddy: అజ్ఞాత సేవల ప్యాకేజీకి ఎంత ఆఫర్ చేశావు బాబూ?: విజయసాయిరెడ్డి
- గెలుపు తనదేనని చెబుతూ అద్దె సేవలెందుకు
- 150 ప్లస్ అంటూ అజ్ఞాత సేవలా?
- ట్విట్టర్ లో విజయసాయిరెడ్డి విమర్శలు
ఏపీ సీఎం చంద్రబాబునాయుడు విజయం తనదేనని అంటూనే కిరాయి సేన సేవలను అద్దెకు తెచ్చుకున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి విమర్శించారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ పెట్టిన ఆయన, "నాకు 65 లక్షల పచ్చ సైన్యం ఉంది. కోటి మంది డ్వాక్రా మహిళలు, 55 లక్షల మంది పెన్షనర్లు, కోటి మంది లబ్దిదారుల ఓట్లు గంపగుత్తగా మావే. మా స్కోర్ 150 ప్లస్ అంటున్న చంద్రబాబు మరోవైపు సీక్రెట్‌గా కిరాయి సేన సేవలను ఎందుకు హైర్ చేసుకున్నట్లో! వారి అజ్ఞాత సేవల ప్యాకేజీకి ఎంత ఆఫర్ చేశారో!" అని ట్విట్ పెట్టారు.
నాకు 65 లక్షల పచ్చ సైన్యం ఉంది. కోటి మంది డ్వాక్రా మహిళలు, 55 లక్షల మంది పెన్షర్లు, కోటి మంది లబ్దిదారుల ఓట్లు గంపగుత్తగా మావే. మా స్కోర్ 150 ప్లస్ అంటున్న చంద్రబాబు మరోవైపు సీక్రెట్‌గా కిరాయి సేన సేవలను ఎందుకు హైర్ చేసుకున్నట్లో! వారి అజ్ఞాత సేవల ప్యాకేజీకి ఎంత ఆఫర్ చేశారో!
— Vijayasai Reddy V (@VSReddy_MP) March 19, 2019