allu arjun: ఇంకా మార్పులు .. చేర్పులు చెబుతూనే వున్న బన్నీ?
- స్క్రిప్ట్ పై త్రివిక్రమ్ కసరత్తు
- ఏప్రిల్లో సెట్స్ పైకి
- తదుపరి సినిమా సుకుమార్ తో
త్రివిక్రమ్ దర్శకత్వంలో బన్నీ ఒక సినిమా చేయనున్నాడనే సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ పైనే త్రివిక్రమ్ కసరత్తు చేస్తున్నాడట. ముందుగా చెప్పిన ప్రకారం ఈ నెలలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లవలసి వుంది. కానీ బన్నీ ఇంకా మార్పులు .. చేర్పులు చెబుతుండటం వలన, ఆలస్యమైందని అంటున్నారు.
ఇంతకుముందు బన్నీ చేసిన రెండు సినిమాలు ఆశించిన స్థాయిలో ఆడకపోవడం వలన, ఈ సినిమాతో తప్పకుండా హిట్ కొట్టాలనే పట్టుదలతో ఆయన వున్నాడు. అందువల్లనే స్క్రిప్ట్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాడని చెబుతున్నారు. ఏప్రిల్లో సెట్స్ పైకి వెళ్లే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఈ సినిమా తరువాత సుకుమార్ తో సెట్స్ పైకి వెళ్లడానికి బన్నీ రంగాన్ని సిద్ధం చేసుకుంటున్నాడు. తదుపరి ప్రాజెక్టును బన్నీ లైన్లో పెట్టేసి ఉంచడం కూడా త్రివిక్రమ్ ను టెన్షన్ పెట్టే అంశమేనని అనుకుంటున్నారు. ఈ సినిమాలో నాయికలుగా పూజా హెగ్డే .. కేథరిన్ కనిపించనున్నారు.