holi: హోలీ వేడుకల్లో మసూద్ అజార్ దిష్టిబొమ్మ దగ్ధం
- ముంబై వర్లీలో వినూత్నంగా హోలికా దహనం
- మసైద్, హఫీజ్, దావూద్ ల దిష్టిబొమ్మల దహనం
- వందేమాతరం నినాదాలు
హోలీ పండుగ సందర్భంగా ముందు రోజు రాత్రి హోలికా దహనం చేయడం ఉత్తరాదిన ఒక సంప్రదాయం. ఈ ఏడాది కూడా హోలీ సంబరాలు ఉల్లాసంగా జరిగాయి. ముంబైలోని వర్లీ ప్రాంతంలో హోలికా దహనాన్ని వినూత్నంగా జరుపుకున్నారు. పుల్వామాలో 40 మంది జవాన్లను పొట్టన పెట్టుకున్న జైషే మొహమ్మద్ చీఫ్ మసూద్ అజార్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా వందేమాతరం నినాదాలు చేస్తూ, తమ దేశ భక్తిని చాటుకున్నారు. మసూద్ తో పాటు దావూవ్ ఇబ్రహీం, ముంబై పేలుళ్ల సూత్రధారి హఫీజ్ సయీద్ ల దిష్టిబొమ్మలను కూడా దహనం చేశారు.
ఈ సందర్భంగా శివసేన నేత ఒకరు మాట్లాడుతూ, రాక్షసులను అంతం చేయాలని అన్నారు. మన దేశంలో జరిగే ప్రతి ఉగ్రదాడికి వీరు ముగ్గురే కారణమని చెప్పారు. వారికి శిక్ష పడాల్సిందేనని అన్నారు.