khammam: చివరికి ఖమ్మం టికెట్ రేణుకాచౌదరికే కేటాయించిన కాంగ్రెస్
- ఎట్టకేలకు అభ్యర్థిగా ప్రకటించిన అధిష్ఠానం
- ప్రత్యామ్నాయాలపై ఆలోచన చేసినా వెనుకడుగు
- అర్ధరాత్రి అభ్యర్థుల జాబితాలోకి పేరు
తెలంగాణలోని ఖమ్మం లోక్సభ స్థానం నుంచి ఎవరిని పోటీ చేయించాలన్న విషయమై తర్జనభర్జన పడిన కాంగ్రెస్ అధిష్ఠానం చివరికి కేంద్ర మాజీ మంత్రి రేణుకాచౌదరివైపే మొగ్గుచూపింది. ఈ స్థానం నుంచి బలమైన ప్రత్యర్థులు రంగంలో ఉండడంతో ఒక దశలో వేరొకరిని బరిలోకి దించాలని కాంగ్రెస్ అధినాయకులు యోచించారు.
టికెట్ కోసం పోటీ పడుతున్న పోట్ల నాగేశ్వరరావు, రవిచంద్రతోపాటు టీఆర్ఎస్ లో టికెట్ రాని పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేరు కూడా పరిశీలించారు. దీంతో మొత్తం 17 నియోజకవర్గాల్లో రెండు విడతల్లో 16 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించిన అధిష్ఠానం ఖమ్మం స్థానాన్ని పెండింగ్లో పెట్టి ఊహాగానాలకు తెరదీసింది.
అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో నియోజకవర్గంలో దీటైన పోటీ ఇవ్వాలంటే రేణుకాచౌదరి అయితేనే బెటర్ అన్న ఉద్దేశంతో శుక్రవారం రాత్రి జాబితాలో ఆమె పేరు చేర్చి విడుదల చేశారు.