Rajath kumar: నిజామాబాద్లో అధిక మొత్తంలో దాఖలైన నామినేషన్లు.. ఎన్నికల అధికారి స్పందన
- బ్యాలెట్ ద్వారానే ఎన్నికలు
- నామినేషన్ల స్క్రూటినీ జరుగుతోంది
- 194 గుర్తులు అందుబాటులో ఉన్నాయి
నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గంలో రైతులు పెద్ద మొత్తంలో నామినేషన్లు దాఖలు చేశారు. తమ పంటలకు మద్దతు ధర లభించటం లేదని, దీనికి నిరసనగా తాము నామినేషన్లు దాఖలు చేస్తున్నట్టు రైతులు కొన్ని రోజుల క్రితం ప్రకటించారు. రైతులు చెప్పిన ప్రకారమే ఈ నియోజకవర్గం నుంచి 250కి పైగా నామినేషన్లు అందటం విశేషం. ఈ నియోజకవర్గం విషయమై ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్ స్పందించారు.
నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ, పోటీలో 64 కంటే ఎక్కువ మంది ఉంటే బ్యాలెట్ ద్వారానే ఎన్నికలు నిర్వహిస్తామన్నారు. ప్రస్తుతం నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గానికి సంబంధించిన నామినేషన్ల విషయంలో స్క్రూటినీ కొనసాగుతోందని తెలిపారు. ప్రస్తుతం 194 గుర్తులు అందుబాటులో ఉన్నాయన్నారు. రిజిస్టరైన పార్టీలు, పోటీ చేసే వాటికే ఆ గుర్తులు కేటాయిస్తామన్నారు.