Narendra Modi: ఇది భారత్ 'మిషన్ శక్తి'... యాంటీ-శాటిలైట్ మిసైల్ పరీక్ష విజయవంతమైంది: నరేంద్ర మోదీ కీలక ప్రకటన
- లోయర్ ఎర్త్ ఆర్బిట్ లోని లైవ్ శాటిలైట్ కూల్చివేత
- యాంటీ శాటిలైట్ మిసైల్ ద్వారా ప్రయోగం
- అమెరికా, రష్యా, చైనాల సరసన ఇండియా
ఇప్పటివరకూ అమెరికా, రష్యా, చైనాలు మాత్రమే సాధించిన మరో ఘనతను ఇండియా కూడా సాధించిందని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. జాతినుద్దేశించి ప్రసంగించిన ఆయన, అంతరిక్షంలో ఓ శాటిలైట్ ను మన శాస్త్రవేత్తలు యాంటీ శాటిలైట్ మిసైల్ ద్వారా కూల్చివేశారని, ఈ ప్రయోగం విజయవంతమైందని, ఇంత టెక్నాలజీని సాధించిన శాస్త్రవేత్తలను అభినందిస్తున్నానని, ఇది ప్రతి భారతీయుడూ గర్వించదగ్గ అంశమని అన్నారు.
లోయర్ ఎర్త్ ఆర్బిట్ లోని ఈ లైవ్ శాటిలైట్ ను ఏ-శాట్ (యాంటీ శాటిలైట్) మిసైల్ ద్వారా కేవలం మూడు నిమిషాల వ్యవధిలో కూల్చేశారని అన్నారు. ఈ ఆపరేషన్ విజయవంతమైందని, 'మిషన్ శక్తి' పేరిట ఇది జరిగిందని అన్నారు. ఇకపై ఎటువంటి లక్ష్యాన్ని అయినా ఛేదించగల శక్తి ఇండియాకు వచ్చినట్టేనని అన్నారు. స్పేస్ పవర్ దేశాల్లో ఇప్పుడు ఇండియా కూడా చేరిందని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు.
PM Narendra Modi: India has entered its name as an elite space power. An anti-satellite weapon A-SAT, successfully targeted a live satellite on a low earth orbit. pic.twitter.com/VSJANo4Jt7
— ANI (@ANI) March 27, 2019