India: సుప్రీంకోర్టు మెట్లు ఎక్కిన ధోని.. ఆమ్రపాలి సంస్థ నుంచి రూ.38.95 కోట్లు ఇప్పించాలని విజ్ఞప్తి!
- ఆమ్రపాలి గ్రూప్ నకు బ్రాండ్ అంబాసిడర్ గా ధోని
- వినియోగదారులను మోసం చేసిన సంస్థ
- అర్థంతరంగా ఒప్పందం నుంచి తప్పుకున్న ధోని
భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోని సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ ఆమ్రపాలి గ్రూపుకు తాను బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నందుకు ఇవ్వాల్సిన నగదును చెల్లించలేదని ధోని పిటిషన్ లో తెలిపారు. అసలు, వడ్డీ కలిపి ఆమ్రపాలి తనకు రూ.38.95 కోట్లు ఇవ్వాలని వెల్లడించారు. ఈ మేరకు తనకు చెల్లించాల్సిందిగా ఆదేశించాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు.
ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ ఆమ్రపాలి గ్రూప్ కు ధోని 2009-16 మధ్యకాలంలో ప్రచారకర్తగా వ్యవహరించారు. అయితే ఈ గ్రూప్ 46,000 మంది వినియోగదారులను మోసం చేయడంతో అన్నివర్గాల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ఆమ్రపాలి గ్రూప్ తో తన ఒప్పందాన్ని ధోని అర్ధంతరంగా రద్దుచేసుకున్నారు. అప్పటివరకూ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించినందుకు రూ.38.95 కోట్లు చెల్లించాలని కోరారు.