sensex: చివర్లో లాభాల నుంచి నష్టాల్లోకి జారుకున్న మార్కెట్లు
- ఎనర్జీ, ఫార్మా, ఆటో స్టాకులకు అమ్మకాల ఒత్తిడి
- 101 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
- 38 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
ఈరోజు దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలను మూటగట్టుకున్నాయి. ఉదయం లాభాలతో ట్రేడింగ్ ను ప్రారంభించిన మార్కెట్లు... మధ్యాహ్నం 2 గంటల వరకు అదే ట్రెండ్ ను కొనసాగించాయి. అయితే చివర్లో ఎనర్జీ, ఫార్మా, ఆటో స్టాకులు అమ్మకాల ఒత్తిడికి గురి కావడంతో నష్టాల్లోకి జారుకున్నాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 101 పాయింట్లు నష్టపోయి 38,132కి పడిపోయింది. నిఫ్టీ 38 పాయింట్లు కోల్పోయి 11,445 వద్ద స్థిరపడింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
యస్ బ్యాంక్ (5.62%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (5.27%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (1.57%), బజాజ్ ఆటో (1.18%), వేదాంత (1.12%).
టాప్ లూజర్స్:
ఎన్టీపీసీ (-2.25%), టాటా మోటార్స్ (-1.85%), భారతి ఎయిర్ టెల్ (-1.49%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (-1.36%), రిలయన్స్ ఇండస్ట్రీస్ (-1.25%).