Shikhar Dhavan: నీ లాగానే చేశాం శిఖర్ ధావన్: నరేంద్ర మోదీ చమత్కారం
- 'మిషన్ శక్తి'పై అభినందనల వర్షం
- అభినందనలు చెప్పిన ధావన్
- చెత్త బంతులను మైదానం బయటకు పంపే నీలానే...
- మన శాస్త్రవేత్తలు చేశారన్న మోదీ
యాంటీ శాటిలైట్ మిసైల్ (ఉపగ్రహ విధ్వంసక క్షిపణి)ని వాడుతూ, అంతరిక్షంలోని లైవ్ శాటిలైట్ ను ధ్వంసం చేసిన ఘనతను ఇండియా సొంతం చేసుకోగా, పలువురు ప్రముఖులు, సెలబ్రిటీల నుంచి అభినందనల వర్షం కురుస్తోంది. భారత క్రికెటర్ శిఖర్ ధావన్ తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ పెడుతూ, ఇది దేశం సాధించిన ఘనతని, ఈ శక్తిని సాధించిన నాలుగో దేశంగా ఇండియా నిలిచిందని గుర్తు చేశారు. ఇందుకు తాను అభినందనలు చెబుతున్నట్టు వ్యాఖ్యానించాడు.
ఇక ఈ ట్వీట్ ను చూసిన ప్రధాని నరేంద్ర మోదీ తనదైన శైలిలో స్పందించారు. "ఇది జాతి మొత్తానికీ గర్వకారణం. చెత్త బంతులను మైదానం బయటకు నువ్వెలా పంపిస్తావో, అలాగే, మన శాస్త్రవేత్తలు, భారత శాంతి, సామరస్యాలకు విఘాతంగా పరిణమించే అటువంటి శాటిలైట్లను ధ్వంసం చేసే సామర్థ్యాన్ని అందించారు" అంటూ చమత్కరించారు.
Indeed, a proud moment for the whole nation.
— Chowkidar Narendra Modi (@narendramodi) March 27, 2019
Just like you smash the bad deliveries out of the park, our scientists have given India the capability to smash those forces who threaten our peace and harmony. #MissionShakti https://t.co/U4mpQiH9Fn