Pawan Kalyan: నేను రాయలసీమలో అడుగుపెట్టకుండా కుట్రలు.. హెలికాప్టర్ రద్దు ఆదేశాలిచ్చింది ఎవరు?: పవన్ ఆగ్రహం

  • ఎన్నికల ప్రచార సభల్లో జగన్‌పై పవన్ మండిపాటు
  • జగన్‌లా తన వద్ద డొంకతిరుగుడు వ్యవహారాలు ఉండవని వ్యాఖ్య
  • ఇన్ని కేసులున్న వ్యక్తి రాష్ట్రానికి ఏం న్యాయం చేస్తాడు?

తాను రాయలసీమలో అడుగుపెట్టకుండా కుట్రలు చేస్తున్నారని, తన హెలికాప్టర్‌కు అనుమతి రద్దు చేశారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హెలికాప్టర్ రద్దు ఆదేశాలను జగన్ ఇచ్చారా? లేక, బీజేపీ నేతలు ఇచ్చారా? అని ప్రశ్నించారు. గురువారం చిత్తూరు జిల్లా మదనపల్లె, అనంతపురం, ధర్మవరం, కడపలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న పవన్ మాట్లాడుతూ.. జగన్‌పై మండిపడ్డారు.

తాను ఎవరితో మాట్లాడితే వారే తన భాగస్వాములని అంటున్నారని, నిజానికి జగన్-అమిత్‌షాలే భాగస్వాములని అన్నారు. జగన్‌లా తన వద్ద డొంకతిరుగుడు వ్యవహారాలు ఉండవని స్పష్టం చేశారు. వైసీపీ నేతల మీద తనకు వ్యక్తిగత ద్వేషం లేదన్నారు. జగన్‌పై బోల్డన్ని కేసులు ఉన్నాయని, రేపటి రోజున కేంద్ర ప్రభుత్వం మళ్లీ వాటిని తిరగదోడితే రాష్ట్రానికి ఎలా న్యాయం చేస్తారని జగన్‌ ను ఉద్దేశించి పరోక్షంగా ప్రశ్నించారు. తాను కేసీఆర్‌ను రెండుసార్లు కలిస్తే నేను టీఆర్ఎస్ భాగస్వామినని టీడీపీ విమర్శించిందని, జగన్ తనను టీడీపీ భాగస్వామి అంటున్నారని పేర్కొన్న పవన్.. నిజానికి బీజేపీ, టీఆర్ఎస్‌లకు జగనే భాగస్వామని ఆరోపించారు.

  • Loading...

More Telugu News