paruchuri: 'వన్ నేనొక్కడినే'లో ప్రధాన లోపం అదే: పరుచూరి గోపాలకృష్ణ
- కథా బీజం గోల్డెన్ రైస్ తాలూకు విత్తనం
- సినిమా చివరిలో అసలు విషయం చెప్పారు
- ప్రేక్షకులు అయోమయానికి లోనయ్యారు
తాజాగా పరుచూరి గోపాలకృష్ణ 'పరుచూరి పాఠాలు' కార్యక్రమంలో 'వన్ నేనొక్కడినే' సినిమాను గురించి మాట్లాడారు. "ఈ సినిమాలో కథా బీజం .. గోల్డెన్ రైస్ తాలూకు విత్తనం. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొని పంటను అందించే ఈ విత్తనం గురించే కథ సాగుతుంది. కథాబీజం కథాంశమై .. ఆ కథావస్తువు కథనం ద్వారా పెరగడమనేది స్క్రీన్ ప్లే లక్షణం.
మీరు గమనిస్తే 2 గంటల 54 నిమిషాల ఈ సినిమా నిడివిలో, చివరి 2 నిమిషాలు కథాబీజం .. కథావస్తువు చెప్పబడ్డాయి. ఆడియన్స్ థియేటర్లో నుంచి లేచి వెళ్లిపోతోన్న సమయంలో, ఆ సినిమాలో కథ వస్తువేదో .. కథాంశమేదో చెప్పబడింది. ఇది కరెక్ట్ కాదు .. ఇది ముందుగానే వచ్చేయాలి. ఈ సినిమా నిజానికి .. భ్రమకి మధ్య ప్రేక్షకులను ఉయ్యాలలూగిస్తూ అయోమయానికి గురిచేసింది. ఇక అక్కడక్కడా వచ్చే ట్విస్టులు కూడా ఆడియన్స్ ను కన్ఫ్యూజ్ చేశాయి. అందువల్లనే కథతో ఆడియన్స్ కనెక్ట్ కాలేకపోయారు" అని చెప్పుకొచ్చారు.