High Court: వివేకా హత్యపై మాట్లాడబోమని నేతలు అంగీకార పత్రం ఇవ్వాలి: హైకోర్టు ఆదేశం
- వివేకా హత్యపై హైకోర్టులో వాదనలు
- వచ్చే నెల 15కి వాయిదా
- దర్యాప్తు వివరాలు బహిర్గతం చెయ్యొద్దు
నేడు వైఎస్.వివేకానందరెడ్డి హత్య కేసును సీబీఐకి అప్పగించాలన్న పిటిషన్లపై ఏపీ హైకోర్టులో వాదనలు జరిగాయి. ఈ కేసులో తదుపరి విచారణను వచ్చే నెల 15కి వాయిదా వేసింది. ఇకపై రాజకీయ నేతలు వివేకా హత్య కేసుపై మాట్లాడటానికి వీల్లేదని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. సిట్ విచారణ యథావిధిగా కొనసాగించవచ్చని తెలిపిన హైకోర్టు, దర్యాప్తు వివరాలు మాత్రం బహిర్గతం చెయ్యొద్దని ఆదేశించింది. అలాగే వివేకా హత్యపై ఇకపై మాట్లాడబోమని నేతలు అంగీకారపత్రం ఇవ్వాలని కోర్టు సూచించింది.