ISRO scientists: పీఎస్ఎల్వీ సీ45 వాహకనౌక నమూనాతో శ్రీవారి సేవలో ఇస్రో శాస్త్రవేత్తలు
- స్వామివారి పాదాల వద్ద ఉంచి పూజలు
- రంగనాయకుల మండపంలో వేదాశీర్వాదం
- ఆనవాయితీని పాటించిన ఇస్రో బాధ్యులు
ఏదైనా రాకెట్ ద్వారా ఉపగ్రహాన్ని కక్ష్యలోకి పంపినా, రాకెట్ పనితీరు పరిశీలించినా వాటి నమూనాలతో తిరుమలలోని శ్రీవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించడం ఇస్రో శాస్త్రవేత్తల అలవాటు. ఈ ఆనవాయితీని ఈరోజు కొనసాగించారు. త్వరలో ప్రయోగించనున్న పీఎస్ఎల్వీ సీ45 వాహకనౌక నమూనాతో ఆలయానికి చేరుకున్న శాస్త్రవేత్తలు నమూనాను స్వామివారి పాదాల వద్ద ఉంచి ప్రత్యేక పూజలు జరిపించారు.
ఈ ఉదయం వీఐపీ ప్రారంభదర్శన సమయంలో ఆలయానికి చేరుకున్న శాస్త్రవేత్తలకు అధికారులు, అర్చకులు సాదర స్వాగతం పలికి పూజలు నిర్వహించారు. అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం అందించి స్వామి వారి తీర్థప్రసాదాలను అందజేశారు.