Hyderabad: నేనున్నంత వరకూ జమ్ముకశ్మీర్ లో ఎవరి ఆటలూ సాగనివ్వను: ప్రధాని మోదీ
- విభజన వాదుల ఆటలు సాగనివ్వను
- శత్రువులకు, ప్రజలకు మధ్య బలమైన గోడగా ఉంటా
- దేశం కోసం దృఢమైన ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలి
జమ్ముకశ్మీర్ కు ప్రత్యేక ప్రధాని కావాలన్న నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూక్ అబ్దుల్లా వ్యాఖ్యలపై ప్రధాని మోదీ నిప్పులు చెరిగారు. హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో బీజేపీ నిర్వహించిన విజయ సంకల్ప సభలో ఆయన మాట్లాడుతూ, ‘మోదీ ఉన్నంత కాలం ఇలాంటి విభజన వాదుల ఆటలు సాగవు. దేశ శత్రువులకు, ప్రజలకు మధ్య బలమైన గోడగా నేను నిలబడతా. నేనున్నంత వరకూ దేశాన్ని విడగొట్టాలన్న కలలు నిజం కానివ్వను. జమ్ముకశ్మీర్ లో ఎవరి ఆటలూ సాగనివ్వను. దేశం కోసం దృఢమైన ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలి’ అని ప్రజలకు మోదీ సూచించారు.