KA Paul: నాకు ఓటేయకున్న ఫర్వాలేదు... సైకిల్, ఫ్యాన్, గ్లాస్ కి మాత్రం వద్దు: కేఏ పాల్

  • నవ్వులతో సాగిన పాల్ రోడ్ షో
  • ఏపీని అమెరికాలా మారుస్తా
  • నరసాపురం పరిధిలోని గ్రామాల్లో పాల్ ప్రచారం

తనకు ప్రజలు ఓటు వేయకున్నా ఫర్వాలేదని, సైకిల్, ఫ్యాన్, గ్లాస్ గుర్తులకు మాత్రం వేయద్దని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ప్రజల్ని కోరారు. తాజాగా ఆయన నర్సాపురం లోక్ సభ నియోజకవర్గ పరిధిలోని పలు గ్రామాల్లో రోడ్ షో నిర్వహించారు. ఈ రోడ్ షో ఆసాంతం నవ్వులతో సాగింది.

ఓ యువకుడు వైసీపీ జెండాను పాల్ కు చూపించగా, తాను వచ్చానని వైసీపీ జెండాను పీకేశారని, ఇలాంటి అద్భుతాలు ముందు ముందు ఎన్నో ఉంటాయని చెప్పారు. ఓ గ్రామంలో వృద్ధుడు తనకు రుణమాఫీ కాలేదని చెబుతూ, తన రుణాన్ని మాఫీ చేస్తే, మీకే ఓటేస్తానని అన్నాడు. వెంటనే పాల్ మన గుర్తు ఏంటని ప్రశ్నించడంతో, ఆ వృద్ధుడు సైకిల్ అనేశాడు. దీంతో అక్కడ నవ్వులే నవ్వులు.

ఇక ఈ సందర్భంగా పాల్ ప్రసంగిస్తూ, చంద్రబాబు తన మనవడికి 8 మంది సెక్యూరిటీ గార్డులను నియమించుకున్నారని, తనకు ప్రాణహాని వున్నా ఇద్దరు గన్ మెన్ లతో ప్రచారం చేసుకుంటున్నానని అన్నారు. తనకు అధికారం ఇస్తే, ఏపీని అమెరికాలా మారుస్తానని హామీ ఇచ్చారు.

  • Loading...

More Telugu News