Vijay Sai Reddy: పోలీసు అధికారులపై ఎన్నికల సంఘానికి మళ్లీ ఫిర్యాదు చేసిన విజయసాయిరెడ్డి

  • ఇంటెలిజెన్స్‌ మాజీ చీఫ్‌దే పెత్తనమంతా అని ఆరోపణ
  • కొత్తబాస్‌ను పక్కనపెట్టి వెంకటేశ్వరరావు చక్రం తిప్పుతున్నారు
  • ఓఎస్డీలు యోగానంద్‌, మాధవ్‌లపైనా ధ్వజం

ఆంధ్రప్రదేశ్‌ ఐపీఎస్‌ అధికారులపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ముఖ్యంగా ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ వెంకటేశ్వరావును ఈసీ పదవి నుంచి తప్పించినా ఆయన టీడీపీ సేవలో మునిగి తేలుతున్నారని ఆరోపించారు. కొత్త ఇంటెలిజెన్స్‌ బాస్‌ను పక్కన పెట్టి అన్నీ తానై వ్యవహరిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

 అలాగే ఓఎస్డీలు యోగానంద్‌, మాధవ్‌, లా అండ్‌ ఆర్డర్‌ డీఐజీ ఘట్టమనేని శ్రీనివాస్‌లు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లా వ్యవహరిస్తూ ఎన్నికల వేళ వారికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. వీరంతా డీజీపీ ఠాకూర్‌ కనుసన్నల్లోనే నడుచుకుంటున్నారని, అందువల్ల ఈ పోలీసు అధికారులతోపాటు డీజీపీని ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలని కోరారు. డీఐజీ కార్యాలయంతోపాటు జిల్లా ఎస్పీ కార్యాలయాల్లో జిల్లా ఎన్నికల పరిశీలకులను నియమించాలని, కాల్‌సెంటర్లను ఏర్పాటు చేయాలని విజయసాయిరెడ్డి తన ఫిర్యాదులో కోరారు.

  • Loading...

More Telugu News