Andhra Pradesh: ‘ప్రత్యేక హోదా’కు మద్దతిచ్చినా కేసీఆర్ ని విమర్శిస్తారా?: చంద్రబాబుపై జగన్ ఫైర్
- హోదాకు మద్దతు ఇచ్చిన కేసీఆర్ ని ‘దొంగ’ అంటారా?
- టీఆర్ఎస్ ను స్వాగతించాల్సింది పోయి విమర్శిస్తారా?
- వైసీపీని గెలిపిస్తే నవరత్నాలు అమలు చేస్తాం
ఏపీకి ప్రత్యేక హోదాకు కేసీఆర్ మద్దతు ఇచ్చినప్పటికీ ఆయన ‘దొంగ’ అని చంద్రబాబు అంటున్నారని వైసీపీ అధినేత జగన్ దుయ్యబట్టారు. తిరుపతిలో నిర్వహించిన చివరి ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ, కేసీఆర్ అంటే చంద్రబాబుకు ఇష్టం పడదని, అందుకు, ఏపీకి ప్రత్యేక హోదా విషయమై మద్దతు ఇస్తానన్న కేసీఆర్ ని దూషిస్తున్నారని, ఆయనను పక్కన పెడుతున్నారని దుయ్యబట్టారు.
ఏపీకి ప్రత్యేక హోదా విషయమై మద్దతు ఇస్తున్న టీఆర్ఎస్ ను స్వాగతించాల్సిందిపోయి విమర్శలు చేస్తారా అని మండిపడ్డారు. ఏపీకి ప్రత్యేక హోదా కావాలంటే మన రాష్ట్రానికి చెందిన 25 మంది ఎంపీలతో పాటు పక్క రాష్ట్రానికి చెందిన టీఆర్ఎస్ ఎంపీలు కూడా కలిస్తే ప్రయోజనం ఉంటుందని, ఈ విషయాన్ని చంద్రబాబు పట్టించుకోవట్లేదని అన్నారు. ఈ ఐదేళ్ల చంద్రబాబు పాలన దారుణంగా ఉందని విమర్శించారు. బాబు పాలనలో అన్ని సంక్షేమ పథకాలో మూలనపడ్డాయని విమర్శించారు. ఈ ఎన్నికల్లో వైసీపీని గెలిపిస్తే స్వర్ణయుగం తీసుకొస్తానని హామీ ఇచ్చారు. ‘నవరత్నాలు’ అమలు చేసి ప్రజలకు అండగా ఉంటానని చెప్పారు.