Rohit Sharma: రోహిత్ శర్మకు తీవ్ర గాయం... ఆరు వారాల విశ్రాంతి!
- ఫీల్డింగ్ ప్రాక్టీస్ చేస్తుండగా గాయం
- మైదానంలోనే విలవిల్లాడిన రోహిత్
- ముంబై తరఫున బరిలోకి దిగేది అనుమానమే
భారత క్రికెట్ జట్టు వైస్ కెప్టెన్, ఈ ఐపీఎల్ సీజన్ లో ముంబై ఇండియన్స్ కు నేతృత్వం వహిస్తున్న రోహిత్ శర్మకు తీవ్రగాయం అయింది. నిన్న రాత్రి మైదానంలో ఫీల్డింగ్ ప్రాక్టీస్ చేస్తున్న రోహిత్ డైవ్ చేయగా, కుడికాలు కండరాలు పట్టేశాయి. దీంతో మైదానంలోనే రోహిత్ విలవిల్లాడగా, జట్టు డాక్టర్ నితిన్ పటేల్ రోహిత్ ను మైదానం నుంచి బయటకు తీసుకెళ్లాడు.
రోహిత్ కు పెద్దగాయమే అయినట్టు తెలుస్తుండగా, వైద్యుల పరీక్షల అనంతరం అతను రెండు నుంచి ఆరు వారాలు విశ్రాంతి తీసుకోవాల్సి వుంటుందని డాక్టర్లు తేల్చారు. వరల్డ్ కప్ లోపు రోహిత్ కోలుకుంటాడని ఆశిస్తున్నట్టు ముంబై ఇండియన్స్ మేనేజ్ మెంట్ వెల్లడించింది.
కాగా, ఈ నెల 15న జట్టును బీసీసీఐ ప్రకటించనుండగా, ఆ సమయానికి రోహిత్ కోలుకుంటేనే అతని పేరును పరిశీలిస్తారని, లేకుంటే కోలుకున్న తరువాత జట్టులో చేర్చవచ్చని సమాచారం. రోహిత్ శర్మ గాయం క్రికెట్ అభిమానులను తీవ్రంగా కలవరపెడుతోంది. రోహిత్ ఈ ఐపీఎల్ సీజన్ లో ముంబై ఇండియన్స్ తరఫున బరిలోకి దిగేది అనుమానమే.