KCR: లంచం ఇవ్వకుంటే పనులు కావట్లేదని ప్రజలు ఆవేదన చెందుతున్నారు: కేసీఆర్
- ప్రభుత్వాన్ని నిందిస్తున్నారు
- ఎందుకు తిట్లు పడాలి?
- విధుల్లో స్పష్టత ఇవ్వాలి
లంచం ఇవ్వకుంటే పనులు కావట్లేదని ప్రజలు ఆవేదన చెందుతున్నారని సీఎం కేసీఆర్ అన్నారు. నేడు కొత్త మునిసిపల్ చట్టం తయారీపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వాన్ని నిందిస్తున్నారని, ఎందుకు తిట్లు పడాలని, దీనిపై కఠినమైన చట్టం తేవాలని అన్నారు.
కార్పొరేషన్లు, పంచాయతీల్లో పారిశుద్ధ్యం, మునిసిపాలిటీలు, పచ్చదనం, మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి పెట్టాలని కేసీఆర్ సూచించారు. పట్టణాలు, నగరాల అభివృద్ధిపై అర్బన్ పాలసీ రూపొందించాలని కేసీఆర్ పేర్కొన్నారు. ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ తరహాలోనే, తెలంగాణ స్టేట్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఏర్పాటును పరిశీలించాలని సూచించారు. జిల్లాతో పాటు మండల పరిషత్‌లకు విధుల్లో స్పష్టత ఇవ్వాలని కేసీఆర్ సూచించారు.