Telangana: ఆ కోడికత్తి తెగితే నీకు తెలుస్తుంది, ఎట్లా ఉంటుందో?: చంద్రబాబుపై తలసాని వ్యాఖ్యలు
- చంద్రబాబు తన ఇష్టమొచ్చినట్టు మాట్లాడారు
- ఎన్నికల ప్రచారంలో అనవసర విషయాలు మాట్లాడారు
- చంద్రబాబు మాటలతో గెలిచే అభ్యర్థులూ ఓడిపోతారు
వైసీపీని ‘కోడికత్తి పార్టీ’ అని చంద్రబాబు తరచుగా విమర్శిస్తున్న విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఘాటుగా స్పందించారు. హైదరాబాద్ లో ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఆ కోడికత్తి తెగితే ఎట్లా ఉంటుందో చంద్రబాబుకు తెలుస్తుందని అన్నారు. చంద్రబాబు తన ఇష్టమొచ్చినట్టు మాట్లాడటం కరెక్టు కాదని అన్నారు. చంద్రబాబు వ్యాఖ్యల కారణంగా ఆ పార్టీలో గెలిచే అభ్యర్థులు కూడా ఓటమి పాలు కావడం ఖాయమని అభిప్రాయపడ్డారు. ఎన్నికల ప్రచారంలో మనం ఇంత వరకూ ఏం చేశామో, ఏం చేయబోతున్నామో చెప్పాలి తప్ప, ఆ విషయాన్ని పక్కన పెట్టి నరేంద్ర మోదీ, కేసీఆర్ పై విమర్శలు, ఆరోపణలు చేశారని, వైఎస్ వివేకా హత్యను రాజకీయం చేస్తూ మాట్లాడారని ఎద్దేవా చేశారు.