TCS: రాజకీయ పార్టీలకు కళ్లు చెదిరే విరాళాన్నిచ్చిన టీసీఎస్!
- 2013లో ప్రోగ్రెసివ్ ఎలక్ట్రోరల్ ట్రస్ట్ ఏర్పాటు
- ఎలక్ట్రోరల్ ట్రస్ట్‌కు విరాళంగా రూ.220 కోట్లు
- చివరి త్రైమాసికం ఫలితాలను వెల్లడించిన టీసీఎస్
దేశీయ దిగ్గజ ఐటీ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ఈ ఏడాది రాజకీయ పార్టీలకు కళ్లు చెదిరే విరాళం ఇచ్చింది. 2013లో టాటా ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రోగ్రెసివ్ ఎలక్ట్రోరల్ ట్రస్ట్ ఏర్పాటైంది. ఈ సంస్థ జనవరి - మార్చి త్రైమాసికంలో రూ.220 కోట్లను ఎలక్ట్రోరల్ ట్రస్ట్‌కు విరాళంగా అందించింది.
ఇంతటి భారీ విరాళాన్ని టీసీఎస్ అందించడం ఇదే తొలిసారి. అయితే ఇంత మొత్తాన్ని ఏయే రాజకీయ పార్టీలకు అందించిందనే విషయంలో మాత్రం స్పష్టత లేదు. గత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికం ఫలితాలను శుక్రవారం టీసీఎస్ వెల్లడించింది. రూ.220 కోట్లను ఎలక్ట్రోరల్ ట్రస్ట్‌కు ఇచ్చిన విషయాన్ని టీసీఎస్ ఆదాయ వ్యయాల్లో ఇతర ఖర్చుల కింద వెల్లడించింది.