Metrology department: జూన్ మొదటి వారంలో కేరళను తాకనున్న రుతుపవనాలు
- 2019 వాతావరణ అంచనాలు విడుదల
- ఈ ఏడాది విస్తారంగా వర్షాలు
- సుమారు 96 శాతం వర్షపాతం నమోదవుతుంది
భారత వాతావరణ శాఖ రైతులకు శుభవార్త చెప్పింది. ఈ ఏడాది దేశ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయని పేర్కొంది. 2019 నైరుతి రుతుపవనాల వర్షపాతంపై అంచనాలను వెల్లడించింది. ఈ ఏడాది జూన్ మొదటి వారంలో కేరళను రుతుపవనాలు తాకనున్నట్టు వెల్లడించింది. రైతులకు ఖరీఫ్ సీజన్ ఉపయోగకరంగా ఉంటుందని, జూన్ నుంచి సెప్టెంబర్ వరకు సాధారణ వర్షపాతం నమోదు అవుతుందని తెలిపింది. జూన్ లో వర్షపాతంపై రెండో విడత అంచనాలను విడుదల చేస్తామని, దీర్ఘకాలికంగా 96 శాతం వర్షపాతం నమోదవుతుందని పేర్కొంది.