sensex: వరుసగా మూడో రోజు లాభాల్లో ముగిసిన మార్కెట్లు
- 139 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
- 47 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
- 7 శాతం పైగా లాభపడ్డ టాటా మోటార్స్
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా మూడో రోజు లాభాల్లో ముగిశాయి. సార్వత్రిక ఎన్నికల తొలి దశ పోలింగ్ పాజిటివ్ గా ముగియడంతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ బలపడింది. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి... సెన్సెక్స్ 139 పాయింట్లు లాభపడి 38,906కు చేరుకుంది. నిఫ్టీ 47 పాయింట్లు పుంజుకుని 11,690కి పెరిగింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
టాటా మోటార్స్ (7.04%), టీసీఎస్ (4.78%), కోల్ ఇండియా (4.30%), టాటా స్టీల్ (3.42%), హీరో మోటో కార్ప్ (2.32%).
టాప్ లూజర్స్:
ఇన్ఫోసిస్ (-2.83%), సన్ ఫార్మా (-1.26%), యస్ బ్యాంక్ (-0.93%), ఓఎన్జీసీ (-0.79%), హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ (-0.62%).