Andhra Pradesh: పీకే వందకోట్ల పేమెంట్ కోసం ‘సీఎం సీఎం‘ అనిపిస్తే జగన్ సంబరపడిపోతున్నారు: లంకా దినకర్
- పోలింగ్ రోజున ఓటింగ్ శాతం తగ్గించేందుకు జగన్ కుట్ర
- ఆ కుట్రలను ప్రజలు పటాపంచలు చేశారు
- దీంతో, జగన్ మైండ్ బ్లాకై నాల్గు రోజులు కనిపించలేదు
ఏపీలో ఎన్నికల పోలింగ్ రోజున ఓటింగ్ శాతం తగ్గించేందుకు జగన్ కుట్రలు, కుయుక్తులు పన్నారని టీడీపీ అధికార ప్రతినిధి లంకా దినకర్ ఆరోపించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఆ కుట్రలను ప్రజలు పటాపంచలు చేశారని అన్నారు. దీంతో, జగన్ మైండ్ బ్లాకై నాలుగు రోజులు కనిపించకుండా పోయారని సెటైర్లు వేశారు.
వైసీపీ రాజకీయ సలహాదారుడు ప్రశాంత్ కిశోర్ (పీకే) తనకు రావాల్సిన చివరి పేమెంట్ కోసం ‘సీఎం సీఎం’ అని తన బృందంతో నాలుగు మాటలనిపించారని సెటైర్లు విసిరారు. ప్రశాంత్ కిశోర్ కు వంద కోట్లు పేమెంట్ చెయ్యాలని, అందుకోసం, వంద రూపాయల కేక్ ఒకటి తెప్పించి కట్ చేసి, ఓ ముక్కను జగన్ నోట్టో పెట్టి, ‘సీఎం.. సీఎం’ అంటూ చప్పట్లు కొట్టించడంతో దానికి జగన్ ఆనందపడిపోయారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. నాలుగు రోజుల తర్వాత బయటకొచ్చిన జగన్ అబద్ధాలు ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారని లంకా దినకర్ దుయ్యబట్టారు.