Suryapet District: సూర్యాపేట జిల్లాలో గుప్తనిధులు... 20 కిలోల పురాతన నాణాలు... అసలు నిజం తెలిసి అధికారుల అవాక్కు!

  • అమరవరంలో తవ్వకాలు జరిపిన గురవారెడ్డి
  • ఆకస్మిక దాడులు చేసి నాణాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు
  • రాగి, ఇత్తడి లోహాల మిశ్రమమేనని తేల్చిన అధికారులు

సూర్యాపేటకు సమీపంలోని హుజూర్ నగర్ మండల పరిధిలో ఉన్న అమరవరంలో ఓ వ్యక్తి ఇంట్లో 20 కిలోల పురాతన నాణాలు గుప్తనిధిగా బయటపడ్డాయి. ఈ వార్త దావానలంలా వ్యాపించగా, సమాచారం అందుకున్న పోలీసులు, అధికారులు ఆకస్మిక దాడి చేసి, అసలు విషయం తెలుసుకుని అవాక్కయ్యారు.

మరిన్ని వివరాల్లోకి వెళితే, అమరవరం గ్రామానికి చెందిన సింగతల గురవారెడ్డి అనే వ్యక్తి, తన ఇంట్లో గుప్త నిధి ఉందని నమ్ముతుండేవాడు. వాటి కోసం నాలుగు మేకలను బలిఇచ్చి, ప్రత్యేక పూజలు జరిపించి, తవ్వకాలు సాగించగా, 20 కిలోల బరువున్న నాణాల పాత్ర బయట పడింది. వాటిని బంగారు నాణాలుగా భావించి సంబరపడ్డాడు. ఈ సంతోషంలో గురవారెడ్డి ఉండగానే అధికారులు దాడి చేసి, వాటిని స్వాధీనం చేసుకుని పరిశీలించారు.

అయితే, అవి బంగారు నాణాలు కావని, రాగి, ఇత్తడి లోహ మిశ్రమాలతో తయారైన నకిలీ నాణాలని తేల్చారు. గుప్త నిధుల తవ్వకం ఘటనపై కేసు నమోదు చేశామని, విచారిస్తున్నామని పోలీసులు తెలిపారు. 

  • Loading...

More Telugu News