NSE: నేటి స్టాక్ మార్కెట్: ఆరంభంలో హుషారు... సాయంత్రానికి కుదేల్!
- సానుకూల అంచనాలతో ఓపెనింగ్స్ దూకుడు
- అమ్మకాల ఒత్తిడితో సూచీలు డౌన్
- ముగింపు సమయానికి లాభాలు ఆవిరి
స్టాక్ మార్కెట్లు నేడు ఒడిదుడుకుల మధ్య ముగిశాయి. ఉదయం హుషారెత్తించే ఓపెనింగ్స్ తో ప్రారంభమైన విపణి సాయంత్రానికి అమ్మకాల ఒత్తిళ్లకు తలొగ్గడంతో లాభాలు ఆవిరయ్యాయి. ఫారెన్ ఇన్వెస్ట్ మెంట్లు, రిలయన్స్ ఫలితాలను దృష్టిలో పెట్టుకుని ఉదయం భారీస్థాయిలో లావాదేవీలు జరిగినా, సాయంత్రానికి అమ్మకాల ఒత్తిడి కారణంగా మార్కెట్ ఇండెక్స్ లు నేలచూపులు చూశాయి.
మార్కెట్ ఆరంభంలో 200కి పైగా పాయింట్లతో జోరు ప్రదర్శించిన సెన్సెక్స్ సాయంత్రానికి అదే ఊపు కనబర్చడంలో విఫలమైంది. చివరికి 135 పాయింట్ల పతనంతో 39,140 వద్ద ముగిసింది. నిఫ్టీ పరిస్థితి కూడా అదే తీరులో సాగింది. ఉదయం 11,850 పాయింట్లతో రికార్డు స్థాయిలో ట్రేడింగ్ జరిగినా, సూచీల అండ లేకపోవడంతో సాయంత్రానికి నిరాశపరిచింది. 34 పాయింట్ల నష్టంతో 11,753 వద్ద స్థిరపడింది.