Chandrababu: చంద్రబాబు తీరు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం పాలు చేసేలా ఉంది: జీవీఎల్
- ఈ దేశంలోని వ్యవస్థలను గౌరవించాలి
- ‘కోడ్’ అమలులో ఉన్నప్పుడు నియమావళి పాటించాలి
- పాటించకపోతే ఈసీ ద్వారా చర్యలు తీసుకుంటాం
ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో పోలవరం ప్రాజెక్టుపై ఏపీ సీఎం చంద్రబాబునాయుడు సమీక్షలు నిర్వహించడంపై విమర్శలు తలెత్తుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బీజేపీ ఎంపీ జీవీఎల్ మాట్లాడుతూ, చంద్రబాబు తీరు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం పాలు చేసే విధంగా ఉందని విమర్శించారు. ఈ దేశంలోని వ్యవస్థలను గౌరవించాలని, మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో పాటించాల్సిన నియమావళిని గుర్తుపెట్టుకుని చంద్రబాబు తు.చ. తప్పకుండా పాటిస్తారని ఆశిస్తామని అన్నారు. అవి పాటించకపోతే ఎన్నికల కమిషన్ ద్వారా చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు.