Rahul Gandhi: కాంగ్రెస్ ప్రచార వీడియో ‘చౌకీదార్ చోర్ హై’పై ఈసీ నిషేధం
- మోదీని ఉద్దేశించి కాంగ్రెస్ యాడ్
- వెంటనే నిలిపివేయాలంటూ రాహుల్‌కు ఆదేశాలు
- కాంగ్రెస్‌పై చర్యలు తప్పవన్న ఎన్నికల అధికారి
ప్రధానమంత్రి నరేంద్రమోదీని ఉద్దేశించి మధ్యప్రదేశ్ కాంగ్రెస్ విడుదల చేసిన ఎన్నికల యాడ్‌పై ఎన్నికల కమిషన్ నిషేధం విధించింది. ‘చౌకీదార్ చోర్ హై’ అంటూ కాంగ్రెస్ రూపొందించిన ఈ వీడియోను వెంటనే నిలిపివేయాలంటూ ఆ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీకి రాసిన లేఖలో ఆదేశించింది. ఈ విషయాన్ని రాష్ట్రంలోని అన్ని జిల్లాల అధికారులకు తెలియజేశారు.
ఎన్నికల నియమావళిని ఉల్లంఘించిన కాంగ్రెస్‌పై చర్యలు తీసుకుంటామని మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రధాన అధికారి వీఎల్ కాంతారావు తెలిపారు. ప్రధాని మోదీని వ్యక్తిగతంగా విమర్శించేందుకే కాంగ్రెస్ ఈ వీడియోను రూపొందించిందని బీజేపీ ఆరోపిస్తుండగా, అలాంటిదేమీ లేదని కాంగ్రెస్ వాదిస్తోంది.