Narendra Modi: ప్రభుత్వాలు ఎప్పుడూ తేనెటీగల్లా ఉండాలి.. కానీ మోదీ ప్రభుత్వం జలగలా తయారైంది: సిద్ధు

  • మోదీపై విరుచుకుపడిన సిద్ధు
  • జలగలా సామాన్యుల రక్తాన్ని పీల్చేస్తున్నారు
  • ఈ ఐదేళ్లలో పెట్రోలు, డీజిల్‌పై పన్ను 16 సార్లు పెరిగింది

ప్రధానమంత్రి నరేంద్రమోదీపై కాంగ్రెస్ నేత, పంజాబ్ మంత్రి నవజోత్ సింగ్ సిద్ధు విరుచుకుపడ్డారు. మోదీ సారథ్యంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం సామాన్యుల రక్తాన్ని జలగలా పీలుస్తోందని ఆరోపించారు. మోదీ ప్రభుత్వం తప్పుడు విధానాల వల్ల గత ఐదేళ్లలో ప్రభుత్వ రంగ సంస్థలు, బ్యాంకులు భారీగా నష్టపోయాయన్నారు.

‘‘ప్రభుత్వాలు ఎప్పుడూ తేనెటీగల్లా ఉండాలని వేదాలు చెబుతున్నాయి. అవి పువ్వుల నుంచి మకరందాన్ని పీల్చేసినా అవి వికసిస్తూనే ఉంటాయి. కానీ, మోదీ ప్రభుత్వం జలగలా తయారైంది. అది సామాన్యుల రక్తాన్ని పీల్చేస్తోంది. దీంతో అతడికి కనీసం నిలబడడానికి కూడా చేతకావడం లేదు’’ అని సిద్ధూ పేర్కొన్నారు. గత ఐదేళ్లలో కేంద్రం 16 సార్లు పెట్రోలు, డీజిల్‌పై సుంకం పెంచిందని సిద్ధు ఆరోపించారు. మన్మోహన్ సింగ్ హయాంలో చమురు ధరలు చాలా తక్కువగా ఉండేవని, కానీ ప్రస్తుత మోదీ ప్రభుత్వ హయాంలో దేశంలో ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని ఆరోపించారు.

  • Loading...

More Telugu News