Andhra Pradesh: రెచ్చగొట్టినా సహనంతో ముందుకు వెళ్లాల్సిన బాధ్యత మాపై ఉంది!: ఏపీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం
- రోల్ మోడల్ గా ఉండాల్సిన బాధ్యత నాపై ఉంది
- ఐఏఎస్ ల జీవితం క్రికెట్ మ్యాచ్ లాంటిది
- ఒక్క బాల్ సరిగ్గా ఆడకపోయినా ఔట్ కావాల్సిందే
రాష్ట్ర సచివాలయం సివిల్ సర్వీస్ అధికారుల హబ్ అని ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం వ్యాఖ్యానించారు. ఉన్నతాధికారులకు రోల్ మోడల్ గా వ్యవహరించాల్సిన బాధ్యత సీఎస్ పై ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. నిజాయతీగా,హుందాగా ఉండటం తన బాధ్యత అని చెప్పారు. రేపు ‘సివిల్ సర్వీస్ డే’ నేపథ్యంలో సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం ఈరోజు సెక్రటేరియట్ లో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘సివిల్ సర్వీస్ అధికారుల జీవితం క్రికెట్ మ్యాచ్ లాంటిదే. ఒక్క బాల్ సరిగ్గా ఆడకపోయినా ఔట్ కావాల్సిందే. రెచ్చగొట్టినా సహనంతో ముందుకు వెళ్లాల్సిన బాధ్యత మాపై ఉంది. ఐఏఎస్ అధికారుల అంతిమ లక్ష్యం మానవత్వం, దేశసమగ్రత, రాజ్యాంగ పరిరక్షణే’ అని స్పష్టం చేశారు.