Tea: ఒక కప్పు టీ రూ.200... దేనితో తయారుచేస్తారో తెలుసా?
- చైనా, తైవాన్ లో కొత్త ట్రెండ్
- పురుగుల విసర్జితాలతో టీ పొడి
- విపరీతమైన డిమాండ్
ప్రపంచవ్యాప్తంగా తేనీరు సేవనం అనేది ఎంతో ప్రాచుర్యంలో ఉన్న అలవాటు. ఇది పురాతన కాలం నుంచి వస్తోంది. అయితే, చైనా, తైవాన్ దేశాల్లో ఇప్పుడు సరికొత్త ట్రెండ్ నడుస్తోంది. అక్కడ పురుగుల విసర్జితాలతో తయారైన టీ అత్యంత ఖరీదైనదిగా పేరుతెచ్చుకుంది. ఇది ఒక కప్పు రూ.200 వరకు ధర పలుకుతోంది. ఈ ప్రత్యేకమైన టీ తాగడం వల్ల బీపీ, జీర్ణకోశ సమస్యలు ఉన్నవాళ్లకు ఎంతో ఉపశమనం కలుగుతుందట.
ఇప్పుడు చైనా, తైవాన్ దేశాల్లో ఈ స్పెషల్ టీ ప్యాకెట్లను కానుకలుగా ఇచ్చిపుచ్చుకుంటున్నారు. కొన్ని రకాల పురుగులు తేయాకులను తిన్న తర్వాత విసర్జించే మలాన్ని సేకరించి, ఎండబెట్టి పొడి చేసి ప్యాక్ చేస్తారు.