Andhra Pradesh: ఏపీ ఆర్థిక శాఖ నిర్ణయాల్లో సీఎస్ ప్రమేయంపై యనమల అభ్యంతరం
- నిధుల సమీకరణ, విడుదలలో కేబినెట్ నిర్ణయమే ఫైనల్
- కేబినెట్ నిర్ణయాలను ప్రశ్నించే హక్కు సీఎస్ కు లేదు
- అప్పులపై, వడ్డీ రేట్లపై ఎల్వీ వ్యాఖ్యలు హాస్యాస్పదం
ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యంపై మంత్రి యనమల రామకృష్ణుడు విమర్శలు చేశారు. ఆర్థిక శాఖకు సంబంధించిన నిర్ణయాల్లో సీఎస్ ప్రమేయంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. నిధుల సమీకరణ, విడుదలలో కేబినెట్ నిర్ణయమే ఫైనల్ అని స్పష్టం చేశారు. కేబినెట్ నిర్ణయాలను ప్రశ్నించే హక్కు సీఎస్ కు లేదని స్పష్టం చేశారు. అప్పులపై, వడ్డీ రేట్లపై సీఎస్ వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని అన్నారు. ప్రధాన కార్యదర్శి సర్వీస్ రూల్స్ అతిక్రమిస్తున్నారని ఆరోపించారు.