Smart Phone: స్మార్ట్ ఫోన్ వినియోగదారుల పాస్‌వర్డ్‌లపై వెలుగు చూసిన ఆసక్తికర అంశాలు
- 23 మిలియన్ల మందికి ఒకే పాస్వర్డ్
- అత్యధికుల పాస్వర్డ్ ‘123456789
- ‘1111111’ పాస్‌వర్డ్‌గా పెట్టుకున్నారట
స్మార్ట్ ఫోన్ వినియోగదారుల పాస్‌వర్డ్‌పై ఓ అధ్యయనం జరిగింది. ఈ అధ్యయనంలో పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. యూకేకు చెందిన నేషనల్ సైబర్ సెక్యూరిటీ సెంటర్ ఈ అధ్యయాన్ని చేసి దానికి సంబంధించిన వివరాలను వెల్లడించింది. ప్రజలు తమకు బాగా గుర్తుండే అంకెలనే ఎక్కువగా పాస్‌వర్డ్‌గా పెట్టుకునేందుకు యత్నిస్తున్నారని తెలిపింది. ‘123456’ నంబర్‌ను ఎక్కువ మంది వినియోగిస్తున్నట్టు ఎన్సీఎస్సీ పేర్కొంది.
23 మిలియన్ల మంది అంటే 2.3 కోట్ల మంది ‘123456’ అంకెను తమ పాస్‌వర్డ్‌గా పెట్టుకున్నారట. దీని తరువాత అత్యధికులు కీ ప్యాడ్లోని మొత్తం నంబర్లు ‘123456789’ను పాస్‌వర్డ్‌గా పెట్టుకున్నారని ఎన్సీఎస్సీ తెలిపింది. పేర్లలో మైఖేల్, జెస్సీకా, యష్లీ, డానియల్, ఛార్లిలను ఎక్కువగా పాస్‌వర్డ్‌లుగా వినియోగిస్తున్నారట. ఇక ఆంగ్ల అక్షరాల విషయానికి వస్తే ‘qwerty’, ‘password’ అనే పదాలను ఎక్కువగా పాస్వర్డులుగా వినియోగిస్తున్నారని ఎన్సీఎస్సీ తెలిపింది. కొందరు ‘1111111’ అంకెను పాస్‌వర్డ్‌గా పెట్టుకున్నారట.