Akhilesh yadav: నేను ప్రధానా? అబ్బే.. అటువంటి ఆలోచనేం లేదు: అఖిలేశ్ యాదవ్
- మహాకూటమి ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరో చెప్పాలన్న బీజేపీ
- తానైతే రేసులో లేనన్న అఖిలేశ్ యాదవ్
- యూపీ వ్యక్తే తదుపరి ప్రధాని అయితే బాగుంటుందని అభిప్రాయం
మహాకూటమిలో అందరూ ప్రధానమంత్రి అభ్యర్థులేనని, అసలు అభ్యర్థి ఎవరో చెప్పాలంటూ బీజేపీ చేస్తున్న విమర్శలపై యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ స్పందించారు. తానైతే ప్రధాని పదవి రేసులో లేనని తేల్చి చెప్పారు. తనకు అటువంటి ఉద్దేశం కూడా లేదన్న ఆయన.. దేశానికి తదుపరి ప్రధాని యూపీ వ్యక్తి అయితే చాలా సంతోషిస్తానని అన్నారు. దేశానికి ప్రధానిగా ఎవరు ఉండాలన్న దానిని ప్రాంతీయ పార్టీలే నిర్ణయిస్తాయని స్పష్టం చేశారు.
ఉత్తరప్రదేశ్లో బీజేపీకి చెక్ పెట్టి అత్యధిక స్థానాలను గెలుచుకోవడం ద్వారా ఆ పార్టీకి భారీ దెబ్బ కొట్టాలని భావిస్తున్న ఎస్పీ-బీఎస్పీలు ఒక్కటయ్యాయి. యూపీతోపాటు ఇతర రాష్ట్రాల్లోనూ కలిసి పోటీ చేస్తున్నాయి. కేంద్రంలో హంగ్ ఏర్పడితే ఎస్పీ-బీఎస్పీ కూటమి కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది.