somireddy: వ్యవసాయ శాఖపై సమీక్షిస్తా.. ఎవరు అడ్డొస్తారో చూస్తా: సోమిరెడ్డి సవాల్

  • సమీక్షను అడ్డుకుంటే సుప్రీంకోర్టుకు వెళ్తా
  • సీఎం, మంత్రులు ఇంట్లో కూర్చోవడం కుదరదు
  • పరిపాలించడం మాకు రాజ్యాంగం కల్పించిన హక్కు

ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున  ఏపీలో సమీక్షలు నిర్వహించేందుకు వీలులేదని వైసీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి స్పందించారు. విజయవాడలో ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, వ్యవసాయ శాఖపై సమీక్షిస్తానని, ఎవరు అడ్డొస్తారో చూస్తా అంటూ సవాల్ విసిరారు. ఎవరైనా తన సమీక్షను అడ్డుకుంటే సుప్రీంకోర్టుకు వెళ్తానని హెచ్చరించారు. మే 23న ఎన్నికల ఫలితాలు వచ్చే దాకా సీఎం, మంత్రులు ఇంట్లో కూర్చోవాలంటే కుదరదని స్పష్టం చేశారు. విధానపరమైన నిర్ణయాలు తీసుకోం గానీ, సమీక్షలు మాత్రం నిర్వహిస్తామని, ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికైన తమకు పరిపాలించడం రాజ్యాంగం కల్పించిన హక్కు అని ఘంటాపథంగా చెప్పారు. 

  • Loading...

More Telugu News