jayalalita: కష్టకాలంలో జయలలితగారు ఆదుకున్నారు: జయసుధ
- జయలలితగారితో మంచి పరిచయం వుంది
- ఆర్థికపరమైన ఇబ్బందుల్లో ఆమెను కలిశాను
- సీరియల్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు
తాజా ఇంటర్వ్యూలో జయసుధ మాట్లాడుతూ, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలితతో తనకి గల సాన్నిహిత్యం గురించి ప్రస్తావించారు. 'ఒక సినిమా షూటింగుకి నేను ఊటీ వెళ్లాను. అక్కడే జయలలితగారి షూటింగు కూడా జరుగుతోంది. ఇద్దరి రూములు పక్కపక్కనే. ఒక రోజున నాకు విపరీతమైన జ్వరం వచ్చింది. ఆ రోజున జయలలితగారికి షూటింగు లేదు. ఆమె నా పక్కనే కూర్చుని తడి గుడ్డతో నుదుటిమీద అద్దుతూ కూర్చున్నారు.
ఆ తరువాత ఆమె ముఖ్యమంత్రి అయినా నన్ను మరిచిపోలేదు. అప్పటికి మా బ్యానర్లో తీసిన మూడు సినిమాలు పరాజయంపాలై ఆర్థికపరమైన ఇబ్బందుల్లో వున్నాము. అలాంటి సమయంలో 'జయ' టీవీలో ప్రసారమయ్యేలా తమిళంలో ఒక సీరియల్ ను నిర్మించాలనుకున్నాము. నేరుగా ఛానల్ కి వెళితే పని కాదనే ఉద్దేశంతో, విషయాన్ని ఆమె దృష్టికి తీసుకెళ్లాను. ఆమె అంత బిజీగా ఉన్నప్పటికీ, ఆ ఛానల్లో ప్రసారం చేసేలా మేము సీరియల్ చేయడానికి అనుమతినిచ్చారు. అలా కష్టకాలంలో ఆమె ఆదుకున్నారు" అని చెప్పుకొచ్చారు.