Gautam Gambhir: నేను పక్కా లోకల్... స్థానికేతరుడ్ని ఎలా అవుతాను?: ఢిల్లీ బీజేపీ అభ్యర్థి గంభీర్

  • మా నాన్న 45 ఏళ్లుగా ఇక్కడే వ్యాపారం చేస్తున్నారు
  • మోదీపై అభిమానంతోనే రాజకీయాల్లోకి వచ్చాను
  • ప్రత్యర్థి వ్యాఖ్యలకు బదులిచ్చిన మాజీ క్రికెటర్

టీమిండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ ఈ ఎన్నికల్లో తూర్పు ఢిల్లీ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీచేస్తున్న సంగతి తెలిసిందే. అయితే, గంభీర్ నాన్ లోకల్ అంటూ కాంగ్రెస్ అభ్యర్థి అరవిందర్ సింగ్ లవ్లీ ప్రచారం చేస్తున్నారు. దీనిపై గంభీర్ మండిపడ్డారు. తాను ఢిల్లీ కుర్రాడ్నని, తాను పుట్టింది, పెరిగింది ఢిల్లీలోనే అని స్పష్టం చేశారు. తన తండ్రి 45 ఏళ్లుగా ఢిల్లీలో వస్త్రవ్యాపారం చేస్తున్నారని, అలాంటప్పుడు తనను నాన్ లోకల్ అని ఎలా అంటారని గంభీర్ ప్రశ్నించారు.

దేశానికి ప్రధానిగా నరేంద్ర మోదీ అందిస్తున్న సేవలతో ప్రభావితం అయ్యానని, ఆయన నాయకత్వాన్ని మరింత బలపర్చేందుకే తాను రాజకీయాల్లోకి వచ్చినట్టు వివరించారు. అయినా, తనను స్థానికేతరుడు, రాజకీయ పర్యాటకుడు అంటూ ప్రచారం చేయడం వెనుక కాంగ్రెస్ ఉద్దేశాలు ఏంటో తెలియడంలేదన్నారు. తాను ఎన్నికల్లో గెలిస్తే తూర్పు ఢిల్లీని అద్భుతమైన రీతిలో అభివృద్ధి చేసి చూపిస్తానని గంభీర్ ధీమాగా చెప్పారు.

  • Loading...

More Telugu News