sensex: అమ్మకాల ఒత్తిడి.. నష్టాల్లో ముగిసిన మార్కెట్లు

  • అమ్మకాల ఒత్తిడికి గురైన స్టాకులు
  • 323 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
  • 84 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ

నిన్న భారీ లాభాలు మూటగట్టుకున్న దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు నష్టాల్లో ముగిశాయి. బ్యాంకింగ్, ఆటో, ఎనర్జీ, మెటల్ షేర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కోవడంతో మార్కెట్లపై ప్రభావం చూపింది. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 323 పాయింట్లు నష్టపోయి 38,730కి పడిపోయింది. నిఫ్టీ 84 పాయింట్లు కోల్పోయి 11,641 వద్ద స్థిరపడింది.

బీఎస్ఈ సెన్సెక్స్ గెయినర్స్:
భారతి ఎయిర్ టెల్ (2.08%), టీసీఎస్ (0.54%), బజాజ్ ఆటో (0.41%).
   
టాప్ లూజర్స్:
టాటా స్టీల్ (-2.89%), వేదాంత (-2.26%), మారుతి సుజుకి (-2.23%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (-1.37%), సన్ ఫార్మా (-1.31%). 

  • Loading...

More Telugu News