Telangana: తెలంగాణలో ప్రతిపక్షాలు బతకాలా? వద్దా?: ఉత్తమ్ కుమార్ రెడ్డి
- కేసీఆర్ అప్రజాస్వామికంగా ప్రవర్తిస్తున్నారు
- అనుమతి లేకుండానే సీఎల్పీ కౌన్సిల్ విలీనమా?
- ఎంఐఎంను ప్రతిపక్ష పార్టీగా చూపే యత్నం తగదు
సీఎం కేసీఆర్ అన్యాయంగా, అప్రజాస్వామికంగా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. ఇంటర్ ఫలితాల్లో ప్రభుత్వ వైఫల్యంపై గవర్నర్ కు అఖిలపక్షం ఫిర్యాదు చేసింది. అనంతరం, మీడియాతో ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, పార్టీ అధ్యక్షుడి అనుమతి లేకుండా సీఎల్పీ కౌన్సిల్ ను విలీనం చేయడానికి వీల్లేదని అన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారని మండిపడ్డారు. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ ను తీసుకునేందుకు సభాపతి ముందుకు రావట్లేదని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీని విలీనం చేసినట్టుగా చేసి, ఎంఐఎంను ప్రతిపక్ష పార్టీగా చూపాలని టీఆర్ఎస్ యత్నిస్తోందని అన్నారు. తెలంగాణలో అసలు ప్రతిపక్షాలు బతకాలా? వద్దా? అని ప్రశ్నించిన ఉత్తమ్, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేందుకు అందరూ కలిసి పని చేయాలని కోరారు.