sensex: ముంబయ్ లో నేడు ఎన్నికలు.. మూతబడ్డ స్టాక్ మార్కెట్
- ఫారిన్ ఎక్స్ ఛేంజ్, కమోడిటీ ఎక్స్ ఛేంజ్ లు కూడా బంద్
- రేపు పని చేయనున్న స్టాక్ మార్కెట్లు
- లాభాల్లో ట్రేడ్ అవుతున్న ఆసియా మార్కెట్లు
ముంబయ్ నగరంలో నేడు సార్వత్రిక ఎన్నికల పోలింగ్ జరుగుతున్న నేపథ్యంలో ఈరోజు స్టాక్ మార్కెట్లు మూతబడ్డాయి. ఫారిన్ ఎక్స్ ఛేంజ్, కమోడిటీ ఎక్స్ ఛేంజ్ లు కూడా క్లోజ్ అయ్యాయి. రేపు ఉదయం మార్కెట్లు యథావిధిగా పని చేస్తాయి. శుక్రవారం నాడు సెన్సెక్స్ 336 పాయింట్లు, నిఫ్టీ 113 పాయింట్ల లాభాలతో ముగిసిన సంగతి తెలిసిందే.
మరోవైపు, ఈ త్రైమాసికంలో అమెరికా జీడీపీ 3.2 శాతం పెరిగిందన్న డేటా నేపథ్యంలో, ఆసియా షేర్లు పుంజుకున్నాయి. మార్చి నెలలో చైనా పారిశ్రామిక లాభాలు పెరగడం కూడా మార్కెట్లకు కలసి వచ్చింది.