Andhra Pradesh: చంద్రబాబు అనే స్వైన్ ఫ్లూ వైరస్ ను వ్యాప్తి చేసే గుంపులో కుటుంబరావు ఒకరు.. మేసిందంతా కక్కిస్తాం!: విజయసాయిరెడ్డి హెచ్చరిక

  • అక్రమార్జనే ఆక్సిజన్ గా మీరంతా బతికారు
  • అప్పులతో రాష్ట్రాన్ని దివాాలా తీయించారు
  • ఇప్పుడు నీతులు వల్లిస్తున్నారా?

వైసీపీ సీనియర్ నేత విజయసాయిరెడ్డిపై ఏపీ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు ఈరోజు మండిపడ్డ సంగతి తెలిసిందే. ఏపీ అప్పులు పెరిగిపోయాయంటూ విజయసాయిరెడ్డి పిచ్చికుక్కలా అరుస్తున్నారని కుటుంబరావు విమర్శించారు. తనను స్టాక్ బ్రోకర్ అంటున్న విజయసాయి దొంగ ఆడిటర్ కాదా? అని ప్రశ్నించారు. బెయిల్ పై వచ్చి బతుకుతున్న పిచ్చి కుక్క విజయసాయిరెడ్డి అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

తాజాగా ఈ వ్యాఖ్యలకు విజయసాయిరెడ్డి కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబు అనే స్వైన్ ఫ్లూ వైరస్ ను వ్యాప్తిచేసే గుంపులో కుటుంబరావు ఒకరని విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు. మే 23 తర్వాత వీరి బతుకులంతా బయటపడతాయనీ, తిన్నదంతా వడ్డీతో సహా కక్కాల్సి ఉంటుందని హెచ్చరించారు.

ఈరోజు ట్విట్టర్ లో విజయసాయిరెడ్డి స్పందిస్తూ..‘కుటుంబరావు గారూ.. స్వైన్ ఫ్లూ మాదిరిగా చంద్రబాబు అనే వైరస్‌ను వ్యాప్తిచేసే గుంపులో మీరొకరు. అవినీతి, అక్రమార్జనే ఆక్సిజన్‌గా బతికే సమూహాలు మీరంతా. అప్పులతో రాష్ట్రాన్ని దివాలా తీయించింది చాలక నీతులు వల్లిస్తారా?  మే 23 తర్వాత మీ బతుకులు రోడ్డున పడతాయి. మేసిందంతా వడ్డీతో సహా కక్కాలి’ అని హెచ్చరించారు.

  • Loading...

More Telugu News