YSRCP: బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన జరిగితేనే మేడే పరిపూర్ణం అవుతుంది!: ఆర్కే రోజా
- అందుకే జగన్ అమ్మ ఒడి పథకం తెచ్చారు
- పిల్లలు బడికి పోవాలి పనికి కాదు
- మేడే శుభాకాంక్షలు చెప్పిన వైసీపీ నేత
బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన జరిగినప్పుడే కార్మిక దినోత్సవం పరిపూర్ణం అవుతుందని వైసీపీ నేత ఆర్కే రోజా తెలిపారు. అందుకోసమే వైసీపీ అధినేత జగన్ ‘అమ్మ ఒడి’ పథకం తీసుకొస్తున్నారని చెప్పారు. దీనివల్ల పిల్లలు పనికి వెళ్లకుండా బడికి వెళతారని వ్యాఖ్యానించారు. సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ట్విట్టర్ లో ఈరోజు రోజా స్పందిస్తూ..‘బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన జరిగిన రోజు శ్రామిక దినోత్సవం సంపూర్ణం అవుతుంది.
దానిలో భాగంగానే పిల్లలు పనికి కాదు బడికి వెళ్ళాలి అని అమ్మ ఒడి పథకం ద్వారా ముందడుగు వేస్తున్నారు మన జగనన్న’ అని ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా శ్రామికులందరికీ మే డే శుభాకాంక్షలు తెలిపారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో నగరి అసెంబ్లీ స్థానం నుంచి వైసీపీ తరఫున గెలుపొందిన రోజా మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.