Chandrababu: 'లక్ష్మీస్ ఎన్టీఆర్', వర్మ, లక్ష్మీపార్వతిపై చంద్రబాబు స్పందన
- రోడ్డు మీద కాకపోతే ఈసీ ఆఫీసులో ప్రెస్ మీట్ పెట్టుకోమనండి
- ఆవిడ ఇప్పుడు ఎక్కడుంది?
- ఇదేమైనా కొత్త సినిమానా? తెలంగాణలో రిలీజ్ అయింది కదా
'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై ముఖ్యమంత్రి చంద్రబాబు పరోక్షంగా విమర్శలు గుప్పించారు. 'ఒకాయన ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టారంట. ఎందుకు పెట్టారో నాకు తెలియదు. రోడ్డు మీద కాకపోతే, ఎన్నికల సంఘం కార్యాలయంలో పెట్టుకోమనండి. నాకేం సంబంధం. ఇదేమైనా కొత్త సినిమానా? తెలంగాణలో రిలీజ్ చేశారు కదా. ఇక్కడ నామీద ఏంటి? ఆవిడ (లక్ష్మీపార్వతి) ఇప్పుడు ఎక్కడుంది? ఎందుకు ఇలాంటి చిల్లర రాజకీయాలు అంటా. ఎవరికైనా ఒక హుందాతనం, డిగ్నిటీ ఉండాలి' అని వ్యాఖ్యానించారు. అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ... మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు బదులుగా ఆయన ఈ సమాధానం ఇచ్చారు.
తన పోరాటమంతా ప్రధాని మోదీపైనే అని చంద్రబాబు అన్నారు. రాష్ట్రానికి ఇవ్వాల్సిన నిధులు ఇచ్చి ఉంటే... ఆయనను నిలదీయాల్సిన అవసరం తనకు లేదని చెప్పారు. ఇక్కడ పెద్దపెద్ద మాటలు మాట్లాడేవారెవరైనా ఢిల్లీకి వెళ్లి మాట్లాడుతున్నారా? అని ప్రశ్నించారు. గుజరాత్, తెలంగాణల కంటే ఏపీలోనే అభివృద్ధి ఎక్కువగా ఉందని అన్నారు.