Andhra Pradesh: ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ ప్రదర్శన అడ్డుకోవడంలో విఫలమైన కడప జేసీపై చర్యలకు సిఫారసు చేశాం: ద్వివేది
- కడపలోని రెండు థియేటర్లలో ఈ చిత్ర ప్రదర్శన జరిగింది
- కడప జేసీపై చర్యలకు సీఈసీకి సిఫారసు చేశాం
- ఏపీలో రీపోలింగ్ నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి
ఎన్నికల నియమావళి నుంచి రాష్ట్రంలోని నాలుగు జిల్లాలకు మినహాయింపు ఇచ్చినట్టు ఏపీ ఎన్నికల సంఘం ప్రధానాధికారి ద్వివేది పేర్కొన్నారు. తుపాన్ సహాయక చర్యల నిమిత్తం తూర్పు గోదావరి, విశాఖపట్టణం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు ఈ మినహాయింపు లభించినట్టు చెప్పారు. ఎన్నికల కోడ్ మినహాయింపు అనేది ఎన్నికల ఫలితాలు వెలువడే వరకూ కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఏపీలో రీపోలింగ్ నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయని, వర్షాలకు స్ట్రాంగ్ రూమ్స్ వద్ద ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకున్నట్టు చెప్పారు.
ఈ సందర్భంగా ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ గురించి ఆయన ప్రస్తావించారు. ఈ చిత్ర ప్రదర్శన అడ్డుకోవడంలో కడప జిల్లా జాయింట్ కలెక్టర్ (జేసీ) విఫలమయ్యారని, ఈ నేపథ్యంలో ఆయనపై చర్యలకు సీఈసీకి సిఫారసు చేసినట్టు చెప్పారు. కడపలో రెండు థియేటర్లలో ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ ప్రదర్శన జరిగిందని అన్నారు.